యూఏఈ - ఇజ్రాయెల్ డీల్‌తో మిడిల్ ఈస్ట్ శాంతి చర్చల పునఃప్రారంభం
- August 15, 2020
జెరూసలెం: యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన తాజా ఒప్పందాలతో మిడిల్ ఈస్ట్ శాంతి చర్చల్లో మంచి ముందడుగు పడినట్లు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇతర దేశాలతోనూ ఇజ్రాయెల్ ఇలాగే సంబంధాలు పెంచుకోవాలని ఆకాంక్షించారు. పాలస్తీనియన్ భూముల నుంచి వైదొలగడానికి సంబంధించి ఇజ్రాయెల్ చేసిన ప్రకటనను ప్రపంచ దేశాలు ఆహ్వానించాయి. బహ్రెయిన్ అలాగే ఒమన్ కూడా ఈ డీల్‌ని ఆహ్వానించాయి. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యూఏఈని నెతన్యాహు సహా పలువురు ప్రముఖులు అభినందించారు. రీజియన్‌లో శాంతి మరింత పెరిగేందుకు ఈ డీల్ ఉపయోగపడ్తుందని ఈజిప్టియన్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసి పేర్కొన్నారు. చైనా కూడా ఈ పరిణామాలపై హర్షం వ్యక్తం చేసింది. జర్మనీతోపాటు ఐక్యరాజ్య సమితి కూడా తాజా పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







