బహ్రెయిన్‌:వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు

- August 16, 2020 , by Maagulf
బహ్రెయిన్‌:వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు

మనామా:మనామా సమీపంలోని జుఫెయిర్ పట్టణంలో ఓ మహిళ వినాయక విగ్రహాలను ధ్వంసం చేసింది.సూపర్‌ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టిన ఈ విగ్రహాలను ఆమె ఒక్కొక్కటిగా తీసి,నేలకేసి కొట్టి, ముక్కలు చేసింది.ఆమె చేస్తున్న అకృత్యాన్ని మరొక మహిళ వీడియో తీసింది.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 

54 ఏళ్ళ వయసుగల ఆ మహిళ వినాయక విగ్రహాలను ధ్వంసం చేసింది.ఆ సూపర్ మార్కెట్ వర్కర్‌ను ఉద్దేశించి ఇస్లామిక్ దేశంలో ఇలాంటివి చెల్లవంటూ మండిపడింది.క్యాపిటల్ గవర్నరేట్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకారం, వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.మతపరమైన మనోభావాలను అగౌరవపరచినందుకు, ఓ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. 

ఆమెపై కేసు పెట్టిన విషయాన్ని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కూడా ధ్రువీకరించింది. జుఫెయిర్‌లోని సూపర్ మార్కెట్‌లో విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు నమోదు చేసినట్లు ఓ ట్వీట్‌లో తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com