హైదరాబాద్:రాచకొండ కమిషనరేట్ లో 105 సీసీ కెమెరాలు, కోవిడ్ 19 ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం

- August 21, 2020 , by Maagulf
హైదరాబాద్:రాచకొండ కమిషనరేట్ లో 105 సీసీ కెమెరాలు, కోవిడ్ 19 ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్:మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటి పరిధిలో కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీసీ నెట్వర్క్ ను మరింత విస్తరించటంలో భాగంగా ఫిర్జాదిగూడలోని 14 కాలనీల్లో అమర్చిన 105 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. అలాగే  20 లక్షల రూపాయల వ్యయంతో సమకూర్చిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను కాలనీల్లోని కీలక ప్రాంతాల్లో అమర్చారు. ఇప్పటివరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 491 మున్సిపాలిటి కెమెరాలు, 5,471 నెను సైతం కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటి సీసీ కెమెరాలతో నేరగాళ్లను పట్టుకోటం సులువుగా మారింది. ఇటీవల జరిగిన ఓ దోపిడితో పాటు పలు చైన స్నాచింగ్ కేసులలో సీసీ కెమెరాల ద్వారానే నేరగాళ్లను పట్టుకున్నారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభం తర్వాత మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సమాజ భద్రత కోసం కాలనీ వాసులు చేస్తున్న కృషిని అభినందించారు. రాచకొండ కమిషనర్ పరిధిని మరింత భద్రమైన ప్రాంతంగా మలుచుకునేందుకు ప్రతి ఒక్కరు చేయూత అందించాలని, అలాగే స్థానిక కార్పోరేటర్లతో పాటు నగర మేయర్ సీసీ కెమెరాల ఏర్పాటు చర్యలకు తమ వంతు సాయం అందించాలని కోరారు. మరోవైపు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ..దాదాపు 60 శాతం కేసులు సీసీ కెమెరా ఫూటేజ్ తో పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో లక్షా 14 వేల కమ్యూనిటీ, నేను సైతం సీసీ కెమెరాలను అమర్చామని వెల్లడించారు. పిర్జాదిగూడ మున్సిపాలిటి 100 శాతం సీసీ నెట్వర్క్ ఉన్న ప్రాంతమని ఆయన ప్రశంసించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి ఫిర్జాదిగూడలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్, మేయర్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com