కువైట్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా న్యాయమూర్తుల బృందం
- September 05, 2020
కువైట్ సిటీ:మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తున్న కువైట్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యాయవ్యవస్థలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తూ కువైట్ చరిత్రలోనే తొలిసారిగా 8 మందిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. ఆ ఎనిమిది మంది జడ్జీలు పదవీ బాధ్యతలను స్వీకరించారు. మొత్తం 54 మందిని సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇటీవలె ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే మహిళా న్యాయమూర్తుల పనితీరుపై కొంతకాలం తర్వాత అంచనాకు వస్తామని కువైట్ సుప్రీం న్యాయమండలి చైర్మన్ యూసుఫ్ అల్ మతావా తెలిపారు. అయితే..ఆ అంచనా కాలం ఎంతకాలమనేది మాత్రం ఛైర్మన్ వెల్లడించలేదు. కాగా..గల్ఫ్ దేశాల్లోనే మహిళా సాధికారికతకు అధిక ప్రాధాన్యత కల్పించటంలో కువైట్ ముందువరుసలో ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కుటుంబ సాంప్రదాయాల మాటున మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నా..వాటిని అధిగమించి ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తూ మహిళాభివృద్ధికి ప్రొత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. ఇక సుప్రీంకోర్టు జడ్జీలుగా మహిళలకు స్థానం కల్పించటం పట్ల కువైట్ మహిళా సంస్కృతి అధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రధాన్యం కల్పించాలంటూ తాము ఎన్నాళ్లుగానో పొరాడుతున్నామని..ఇన్నాళ్లు తర్వాత తమ పోరాటం సత్ఫలితానని ఇచ్చిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







