భారత దేశంలో నివాస‌యోగ్య‌మైన న‌గ‌రంగా హైద‌రాబాద్-మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

- September 16, 2020 , by Maagulf
భారత దేశంలో నివాస‌యోగ్య‌మైన న‌గ‌రంగా హైద‌రాబాద్-మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

హైద‌రాబాద్:భారత దేశంలో నివాస‌యోగ్య‌మైన ఉపాధి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై 34 న‌గ‌రాల్లో జ‌రిపిన స‌ర్వేలో హైద‌రాబాద్ అత్యుత్త‌మ‌మైన న‌గ‌రంగా నిలిచింద‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. బుధ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ...హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వ‌హించిన స‌ర్వేలో బెస్ట్ లివెబుల్ సిటీగా హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింద‌ని తెలిపారు.  చారిత్ర‌క గొప్ప‌ద‌నంతో పాటు మౌలిక వ‌స‌తులు, సుస్థిర అభివృద్ది, ఆర్థిక ప్ర‌గ‌తిలో హైద‌రాబాద్ ఉత్త‌మ ప‌ర్యాట‌క న‌గ‌రంగా స్థానాన్ని ద‌క్కించుకుందని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్దికి రాష్ట్ర‌ ముఖ్య మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆకాంక్ష‌ల మేర‌కు రాష్ట్ర పురపాల‌క, ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌, జంక్ష‌న్ల అభివృద్ది, స్లిప్ రోడ్లు, లింక్‌రోడ్ల నిర్మాణాలు చేప‌ట్ట‌డం జ‌రిగిందని తెలిపారు. న‌గ‌రంలో వివిధ రంగాల్లో రూ. 50వేల కోట్ల వ్య‌యంతో అభివృద్ది ప‌నులు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ. 30 వేల నుండి రూ. 40వేల  కోట్ల వ‌ర‌కు అభివృద్ది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. గ‌తంలో నీటి కొర‌త, విద్యుత్ అంత‌రాయం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత ఈ స‌మ‌స్య‌లు లేవ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డ‌లు పుంజుకోవ‌డానికి, నివాసయోగ్య‌త‌కు అనువైన‌దిగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com