చీర్ గాళ్స్,అభిమానులు లేకుండా IPL..

- September 17, 2020 , by Maagulf
చీర్ గాళ్స్,అభిమానులు లేకుండా IPL..

యూఏఈ:IPL2020 ఈసారి ఛీర్ గాళ్స్ గ్లామర్, అభిమానుల అరుపులు లేకుండా శనివారం ప్రారంభం కానుంది. అయితే అవన్నీ లేకపోయినా ఆటను ఆస్వాదించటానికి సిద్ధమవుతున్నారు క్రికెట్ లవర్స్. మార్చిలో మొదలవ్వాల్సిన ట్వంటీ 20 టోర్నమెంట్ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వాయిదా పడింది. భారతదేశంలో కేసులు పెరగడంతో దీనిని యూఏఈ కు తరలించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ సెప్టెంబర్ 19 న అబుధాబి లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడగానే ఎనిమిది జట్లు యూఏఈలో అడుగుపెట్టినప్పటి నుండి కఠినమైన కరోనా నిబంధనలు ఎదుర్కొన్నారు. సురక్షితమైన బయో బబుల్ లో IPL ఆటగాళ్లను ఉంచారు.

ప్రపంచంలోని అత్యంత ధనిక టి20 లీగ్ లో గాలా ప్రారంభోత్సవం జరగదు. దుబాయ్, షార్జాతో సహా మూడు వేదికలలో మూసివేసిన గేట్ల వెనుక క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ప్రేక్షకులు స్టేడియానికి వచ్చి వీక్షించే అవకాశం లేకపోవడంతో వారంతా టీవీల్లో వీక్షిస్తారని, ఫలితంగా ఈసారి రేటింగ్ అధికంగా ఉంటుందని బ్రాడ్‌కాస్టర్లు భావిస్తున్నట్టు BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

53 రోజుల టోర్నమెంట్‌ నవంబర్ 10 తో ముగిస్తుందని గంగూలీ చెప్పారు. కఠినమైన BCCI ఆరోగ్య భద్రతా ప్రోటోకాల్స్ కింద ఆటగాళ్లను హోటల్స్ లో ఉంచారు.IPL ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేశీయ లీగ్. కానీ 2008 లో ప్రారంభమైనప్పటి నుండి అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ కేసులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. 2013 లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ అనే రెండు జట్లు రెండు సీజన్లలో సస్పెండ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com