ఢిల్లీ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్లకు ప్రత్యేక టెర్మినల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి
- September 17, 2020
న్యూఢిల్లీ: భారత దేశంలోనే తొలిసారి ప్రైవేట్ జెట్ విమానాల కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేకంగా నిర్మించిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ టెర్మినల్ ద్వారా ప్రైవేట్ జెట్ల విమాన కార్యకలాపాలను నిర్వహిస్తారు. చార్టెడ్ విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఈ టెర్మినల్ సేవలు వినియోగించుకోవచ్చు. ఇందులో ప్రైవేట్ విమానాల కోసం 57 పార్కింగ్ బేలు ఉన్నాయి. రోజులో సుమారు 150 చార్టెడ్ విమానాలు ఇక్కడి నుంచి ప్రయాణించే అవకాశమున్నది.
కరోనాకు ముందు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు 40 ప్రైవేట్ జెట్ విమానాలు ప్రయాణించగా ప్రస్తుతం ఈ సంఖ్య 20గా ఉన్నదని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రత్యేక టెర్మినల్ కాస్త చిన్నగా ఉన్నప్పటికీ దీని ప్రాముఖ్యాన్ని పెంచుతుందని ఆయన చెప్పారు. టెర్మినల్ ద్వారా ప్రతి గంటకు 50 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని GMR గ్రూప్ నేతృత్వంలోని డీఐఎల్ పేర్కొంది.



తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







