బహ్రెయిన్:పనిమనిషి జీవితంతో ఆటలు..డిక్కీలో కూర్చొబెట్టి డ్రైవ్ చేసిన మహిళ అరెస్ట్

- September 18, 2020 , by Maagulf
బహ్రెయిన్:పనిమనిషి జీవితంతో ఆటలు..డిక్కీలో కూర్చొబెట్టి డ్రైవ్ చేసిన మహిళ అరెస్ట్

మనామా:గల్ఫ్ కంట్రీస్ లో కొందరు యజమానుల తీరు నిర్దాక్షణ్యంగా ఉంటుందనేందుకు ఈ ఘటన మరొక నిదర్శనం. ఇంట్లో పని చేసే మహిళలను డిక్కీలో కూర్చొబెట్టి కారును డ్రైవ్ చేసిందో మహిళ. పబ్లిక్ రోడ్డులో కారు ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు మహిళా డ్రైవర్ తతంగాన్ని వీడియో తీశారు. అది కాస్త వైరల్ అయ్యింది. డిక్కీలో పెట్టిన బాక్సు కింద పడకుండా పట్టుకునేందుకు ఆ పనిమనిషిని కూడా డిక్కీలో కూర్చొబెట్టడం విమర్శలకు తావిచ్చింది.ఓ బాక్సు కోసం ఇంట్లో పని చేసే మహిళ ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ నెటిజన్లు ఆ మహిళా డ్రైవర్ పై దుమ్మెత్తిపోశారు. అయితే..నెట్ లో చక్కర్లు కొట్టి ఆ వీడియో చివరికి పోలీసుల కంట పడింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఓ మహిళ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించిన సదరు మహిళా డ్రైవర్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. కేసును న్యాయవిచారణకు సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com