కాజల్ బిజినెస్ ప్లాన్..మహిళల కోసం ప్రత్యేక గేమ్స్
- November 10, 2020
ముంబై: పెళ్లయి హనీమూన్ లో భర్త కిచ్లూతో ఎంజాయ్ చేస్తున్న సినీ నటి కాజల్ అగర్వాల్.. అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముంబైకి చెందిన ఓకే (okie) గేమింగ్ కంపెనీలో 15 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీని కోసం ఎంత మొత్తం చెల్లించిందనేది తెలియరాలేదు. కరోనా నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్.. ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ ఉపయోగం శరవేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే యూజర్లు పెరుగుతుండడంతో గేమింగ్ పరిశ్రమ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పిన కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ గా బిజినెస్ ను ఆప్షన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ర్టానిక్.. డిజిటల్.. గేమింగ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి సాధిస్తుండడంతో ఇదే మంచి అవకాశంగా కాజల్ భావించి వాటాలు కొన్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త కిచ్లూను పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లయ్యాక తొలి అడుగుగా గేమింగ్ కంపెనీలో వాటాలు కొనేసింది. ప్రాంతీయ గేమ్స్ తో మార్కెట్లోకి దిగిన ఓకే ప్లాట్ ఫాం ద్వారా కాజల్ మహిళల కోసం ప్రత్యేక గేమ్స్ అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి