ఫుజైరాలో కోవిడ్ ఆంక్షలు కఠినతరం..పబ్లిక్ ప్రాంతాల్లో పరిమితులు
- February 19, 2021
ఫుజైరా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈలోని పలు ఎమిరేట్స్ ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఫెడరల్ ప్రభుత్వం మార్గనిర్దేశకాలకు అనుగుణంగా ఫుజైరా కూడా తమ ఎమిరేట్స్ పరిధిలో నిబంధనలను కఠినతరం చేసింది. ముఖ్యంగా పబ్లిక్ ప్రాంతాలు, పలు వ్యాపార కేంద్రాలు, మాల్స్ దగ్గర రద్దీని నియంత్రించేందుకు పరిమితులు విధించింది. ఫుజైరా ప్రకటించిన కొత్త నిబంధనల మేరకు ఇక నుంచి పబ్లిక్ బీచ్ లు, పార్క్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యంలో 70 శాతానికి మించి విజిటర్లను అనుమతించరు. షాపింగ్ మాల్స్ లో 60 శాతం, సినిమా థియేటర్లు, జిమ్ములు, స్విమ్మింగ్ ఫూల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులలో 50 శాతం మందికే అనుమతి ఉంటుంది. అలాగే ఫుజైరా మున్సిపాలిటీ పరిధిలో అన్ని మ్యూజిక్ ఈవెంట్లు, ఇతర వేడుకలను రద్దు చేశారు. జన సమీకరణకు అవకాశం ఉండే ఈవెంట్లకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. సేవా రంగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అందరూ ఖచ్చితంగా రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







