హోటళ్లకు ఉత్తర్వులు

- February 24, 2021 , by Maagulf
హోటళ్లకు ఉత్తర్వులు

షార్జా: పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేక్రమంలో యూఏఈ ప్రభుత్వం ఎంతో క్రియాశీలముగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో హోటళ్లు నడిపేవారికి ఉత్తర్వులు జారీ చేసింది షార్జా. షార్జాలోని హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి రెండు వారాలకు తప్పనిసరిగా పిసిఆర్ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, వ్యాక్సిన్లు రెండు డోసులు పూర్తిచేసినవారికి ఈ నియమాన్ని మినహాయించారు.

హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్లను తీసుకున్నట్టు/నెగటివ్ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని కలిగిఉన్నట్టు ధృవీకరిస్తూ స్టిక్కర్లను సంబంధిత హోటళ్లు అందరికి కనపడేట్టు ఉంచాలి. మెనూ కార్డులను కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి; ఒక టేబుల్ కు నలుగురు మాత్రమే ఉండేట్టు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని షార్జా మున్సిపాలిటీ తెలిపింది.

హోటళ్లు ఈ నియమాలను పాటిస్తున్నదీ లేనిది పర్యవేక్షించేందుకు షార్జా మునిసిపాలిటీ తనిఖీలను ముమ్మరం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com