కరోనా ను అరికట్టేందుకు ఐడియా కొట్టు..భారీ నజరానా పట్టు..!!

- February 24, 2021 , by Maagulf
కరోనా ను అరికట్టేందుకు ఐడియా కొట్టు..భారీ నజరానా పట్టు..!!

షార్జా: కరోనా వేరియంట్ లతో సమగ్రంగా పోరాడి కరోనా ను నియంత్రించేందుకు ప్రభుత్వానికి సలహా ఇచ్చినవారికి భారీ నజరానా ప్రకటించింది షార్జా ప్రభుత్వం..'ఇన్నోవేషన్ అవార్డు' లో భాగంగా చక్కటి ఐడియా ఇచ్చిన వారికి 20,000 దిర్హాముల బహుమతి లో కూడిన అవార్డును అందుకునే అవకాశాన్ని షార్జా పోలీసు అందించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం మెదడుకు పదునుపెట్టండి..సొమ్మును గెలవండి..

"కోవిడ్ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అనే దిశగా వినూత్న ఆలోచనలకు సమగ్రరూపం ఇచ్చేందుకు షార్జా పోలీసులు ఇన్నోవేషన్ ల్యాబ్ ను ప్రారంభించారు. ల్యాబ్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రకటించిన ఈ అవార్డు అన్ని వయసుల వారికి మరియు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది.'ఆలోచనలు మరియు ప్రాజెక్టులు' అని 'స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్ డెవలప్‌మెంట్' విభాగం అని ఈ అవార్డు రెండు విభాగాలుగా విభజించబడింది.  మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్ తెరిచి ఉంటుంది. షార్జా పోలీసుల సోషల్ మీడియా పేజీలలో అవార్డు కు సంబంధించిన లింక్ అందించబడుతుంది" అని డైరెక్టర్ కల్నల్ తారిక్ అల్ మిడ్ఫా అన్నారు. 

పాల్గొనదలచినవారు..ఒక్కరిగా లేదా నలుగురు సభ్యుల బృందంలో భాగంగా చేరవచ్చు. కోవిడ్ నివారణ, రికవరీ, వ్యాక్సిన్లు మరియు ఇతర వైరస్-సంబంధిత విషయాల గురించి సృజనాత్మక ఆలోచనలు అందించాలి. లేదా...కోవిడ్ పై పోరాడటానికి ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతునిచ్చే వినూత్న ఐడియా అయిఉండాలి.. విజేతలు 20 వేల దిర్హాముల నగదు బహుమతులు పొందవచ్చు.

కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరియు పునరావృతమయ్యే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠినమైన జాగరూకతతో ఉండటానికి అవగాహన కల్పించే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ సైఫ్ అల్ జెరి అల్ షంసీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com