సునామీలా విరుచుకుపడుతున్న కరోనా.. కేంద్రం కీలక నిర్ణయం..

- April 24, 2021 , by Maagulf
సునామీలా విరుచుకుపడుతున్న కరోనా.. కేంద్రం కీలక నిర్ణయం..

భారత్‌ కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆక్సీజన్ కొరత, అత్యవసర మందుల కొరత యావత్ దేశాన్ని వేధిస్తోంది. మన దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 శనివారం మెడికల్ ఆక్సీజన్ కొరతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కోరోనా సమయంలో వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్, కరోనా టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్‌ను తక్షణమే మాఫీ చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. 

కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్ మాఫీ చేసిన వస్తువుల జాబితాలో..ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఫిల్లింగ్ సిస్టమ్స్, కంటైనర్లు, ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు ఉన్నాయి. మూడు నెలల వరకు ఇది అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో వైద్య సేవలకు అవసరమయ్యే వస్తువుల లభ్యతను పెరగడంతో పాటు చౌకగా లభిస్తాయని వెల్లడించింది. వాటికి త్వరగా కస్టమ్స్ అనుమతులు వచ్చేలా చూడాలని రెవెన్యూ శాఖ అధికారులను ప్రధాని ఆదేశించారు.

ఆక్సీజన్ కొరత నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ తరలిస్తున్నారు. సకాలంలో అందించేందుకు రైళ్లతో పాటు యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను చేరవేస్తున్నారు. అటు సింగపూర్ నుంచి కూడా ఆక్సిజన్ కంటైనర్లు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com