ఉమ్రా ప్రార్ధనలకు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి
- July 31, 2021
ఒమన్: ఉమ్రా ప్రార్ధనల్లో పాల్గొనేందుకు వెళ్లాలనుకునే తమ దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది ఒమన్. కోవిడ్ నేపథ్యంలో ఉమ్రా ప్రార్ధనలకు వచ్చే భక్తులకు సంఖ్యపై పరిమితి విధించిన సౌదీ ప్రభుత్వం..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రం అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.అంటే ఉమ్రా ప్రార్ధనల్లో పాల్గొనాలని అనుకుంటున్న భక్తులందరూ ఖచ్చితంగా పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది ఉండాలని సూచించింది.ఒమన్ నుంచి జెడ్డాకు ఆగస్ట్ 11 నుంచి విమాన సర్వీసులను పునరుద్దరిస్తున్నామని తెలిపింది.ఉమ్రా భక్తులు తమ ప్రయాణానికి రెండు వారాల ముందుగానే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం ఉండదని వివరించింది.ఉమ్రా ప్రార్ధనలకు వెళ్లే వారు సౌదీ నిబంధనలను ముందస్తుగానే తెలుసుకోవాలని పేర్కొంది. జెడ్డా వెళ్లే ప్రయాణికులు Omanair.com వెబ్ సైట్ ద్వారా కోవిడ్ ట్రావెల్ రూల్స్ ను తెలుసుకోని..అర్హులైన వారు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







