అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో వాణిజ్యంపై భారత్-యూఏఈ వెబ్ నార్
- August 30, 2021
యూఏఈ: వ్యవసాయం, సాగు ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాల్లో వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలపై ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్ నార్ నిర్వహించింది. యూఏఈలో ఆహారం, పానీయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ రంగాలలో ప్రత్యేకంగా వాణిజ్యం, పెట్టుబడి, పరస్పర సహకార అవకాశాలపై పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ వెబ్ నార్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అహార భద్రతకు భారత్-యూఏఈ మధ్య పరస్పర సహకారం ఆవశ్యతపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం భారతదేశం నుండి యూఏఈకి ఎగుమతి చేసే ఆహార పదార్థాలలో తృణధాన్యాలు, చక్కెర, పండ్లు, కూరగాయలు, టీ, మాంసం, సీఫుడ్ ఉన్నాయి. ఈ వెబ్‌నార్ లో ఫుడ్&బేవరేజస్ కౌన్సిల్ సెక్టోరియల్ ఛైర్మన్, క్యాపిటల్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ అగర్వాల్, విమ్కో మేనేజింగ్ డైరెక్టర్, ఫుడ్& ప్యాకేజింగ్ కౌన్సిల్ సెక్టోరియల్ ఛైర్మన్ ఆర్ సెంగుట్టువన్, ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ టెక్నాలజీపై కౌన్సిల్ సెక్టోరల్ కమిటీ వైస్ ఛైర్మన్, కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గ్రోవర్ పాల్గొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అశోక్ సేథి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
--సుమన్ కోలగట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







