రాకెట్ దాడులు తిప్పికొట్టాం.. ఆపరేషన్ కొనసాగుతోంది! - అమెరికా
- August 30, 2021
కాబూల్: ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్ దాడులు జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్‌లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్ దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.
సీ- ర్యామ్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్ గన్ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి(ఆగష్టు 31)తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది అఫ్గన్ ప్రజలతో పాటు 13 మంది అమెరికా సైనికులను బలిగొన్న ఐసిస్- కె(ఇస్లామిక్ స్టేట్- ఖోరసాన్) గ్రూపు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు దాడులు జరగడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







