ఫస్ట్ మొబైల్ థియేటర్ లో ‘బెల్‌బాటమ్’
- August 30, 2021
ప్రపంచంలోనే అతి ఎత్తైన మొబైల్ థియేటర్ లద్దాఖ్‌లో ప్రారంభమైంది. సముద్ర మట్టానికి సుమారు 11,562 అడుగుల ఎత్తులో, తక్కువ ఖర్చుతో అన్ని రకాల సౌకర్యాలతో ఈ మొబైల్ థియేటర్‌ను నెలకొల్పారు. మారుమూల గ్రామాల ప్రజల సైతం సినిమాకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పిక్చర్ టైమ్ ఫౌండర్, సీఈఓ సుశీల్ తెలిపారు. తాజాగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ నటించిన ‘బెల్‌బాటమ్’ చిత్రాన్ని తొలిసారి ప్రదర్శించారు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఎత్తైన మొబైల్ థియేటర్‌లో ‘బెల్‌బాటమ్’ చిత్రాన్ని ప్రదర్శించడం నాకు గక్కిన గౌరవంగా భావిస్తున్నా. దీనితో నా మనసు నిండిపోయింది’’ అని ట్వీట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం వహించారు. వాణీకపూర్, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు. పలు మార్లు వామిదా పడుతూ వచ్చిన ఈ చిత్రంపై అభిమానులు అంచనాలు పంచుకున్నారు. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకొంది.
Makes my heart swell with pride that BellBottom was screened at World’s highest mobile theatre at Leh in Ladakh. At an altitude of 11562 ft, the theatre can operate at -28 degrees C. What an amazing feat! pic.twitter.com/5ozbpkTCIb
— Akshay Kumar (@akshaykumar) August 29, 2021
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







