ఫైజర్‌ వ్యాక్సిన్‌తో మహిళ మృతి..

- August 30, 2021 , by Maagulf
ఫైజర్‌ వ్యాక్సిన్‌తో మహిళ మృతి..

న్యూజిలాండ్‌:కరోనా హమ్మారిపై విజయం సాధించడానికి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాలు స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. మరికొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకుని తమ ప్రజలకు అందిస్తున్నాయి.అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా, న్యూజిలాండ్‌లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మ‌హిళ చ‌నిపోయిన‌ట్లు న్యూజిలాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మ‌యోకార్డిటిస్ అంటే గుండె కండ‌రాల్లో ఇన్‌ఫ్లేమేష‌న్‌తో ఆ మ‌హిళ చనిపోయినట్టు భావిస్తున్నామని.. ఫైజ‌ర్ వ్యాక్సిన్‌ వ‌ల్ల దేశంలో సంభ‌వించిన తొలి మరణం ఇదేనని ప్రకటించింది న్యూజిలాండ్‌. ఇక, ఆ మహిళ ఇప్పటికే ప‌లు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిపింది. మరోవైపు.. ఫైజ‌ర్ వ్యాక్సిన్ వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల కంటే ప్రయోజ‌నాలే ఎక్కువగా ఉన్నాయని కూడా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com