వలసదారుల నుంచి తక్కువ మొత్తంలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు వసూలు

- August 31, 2021 , by Maagulf
వలసదారుల నుంచి తక్కువ మొత్తంలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు వసూలు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం 2020-21 సంవత్సరానికిగాను వలసదారుల నుంచి వసూలు చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు 87.1 మిలియన్ కువైటీ దినార్స్. అంచనాల కంటే ఇది 20.8 శాతం తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 110 మిలియన్ కువైటీ దినార్లను వసూలు చేయాలని అంచనా వేసింది. 2019-20 సంవత్సరానికి 107 మిలియన్ కువైటీ దినార్లు వసూలయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో చోటు చేసుకున్న క్యాన్సిలేషన్ల నేపథ్యంలోనే ఇలా జరిగి వుంటుందని అథారిటీస్ అంచనా వేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com