‘సీటీమార్’ ట్రైలర్ విడుదల
- August 31, 2021
హైదరాబాద్: హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది.భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల చేశారు.గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్ గా నటించారు. వీరి మధ్య వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
అయితే ప్రస్తుతం థియేటర్లు తెరచుకున్నప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్న నిర్మాతలు..ఎట్టకేలకు సెప్టెంబర్ 10న థియేటర్లోకే వస్తున్నట్లుగా ప్రకటించారు. చాలాకాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నా గోపీచంద్ కి ఈసారైనా ‘సీటీమార్’ కలిసొస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







