కువైట్ క్రికెట్ కీలక నిర్ణయం
- September 11, 2021
కువైట్ సిటీ: కువైట్ క్రికెట్(కేసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆటగాళ్లకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కువైత్‌లోని క్రికెటర్లు ఎవరైతే కువైట్ క్రికెట్లో రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఎంఈసీ స్టడీ గ్రూపుతో కలిసి స్కాలర్షిప్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. బుధవారం సాయంత్రం సాల్మియాలోని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రధానకార్యాలయంలో ఎంఈసీ స్టడీ గ్రూపు, కువైత్ క్రికెట్ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రికెటర్లకు ఉపకార వేతనాలపై ప్రకట చేశాయి. దీనిలోభాగంగా ఎంఈసీ స్టడీ గ్రూపు సీఈఓ ముజ్జ్ మిర్జా, కువైట్ క్రికెట్ అధ్యక్షుడు హైదర్ ఫార్మన్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం కువైట్ క్రికెట్(కేసీ)తో రిజిస్టర్ చేసుకున్న క్రికెట్ ప్లేయర్లకు ఎంతో హెల్ప్ అవుతుందని కేసీ డైరెక్టర్ జనరల్ సాజిద్ అష్రఫ్ అభిప్రాయపడ్డారు.
కువైట్‌లోని ఆటగాళ్లకు వారి కెరీర్, గేమ్‌లో తోడ్పాటుకు ఎల్లప్పుడూ తాము చేయూతనిచ్చేందుకు ముందు ఉంటామని కేసీ ప్రెసిడెంట్ హైదర్ ఫార్మన్ తెలిపారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌లో కువైట్ 27వ స్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే ఉమెన్స్ క్రికెట్ జట్టు 26వ ర్యాంకులో ఉందన్నారు. త్వరలోనే కువైట్ లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచుల ప్రత్యక్షప్రసారం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను కూడా తీసుకువస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కాగా, కువైట్ లోకల్ క్రికెట్ జట్లలో అధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులే ఆడుతున్నట్లు సమాచారం. వీరిలో ఎవరైతే కేసీతో రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఈ స్కాలర్షిప్ పథకంతో భారీ లబ్ధి చేకూరనుంది. ఎందుకంటే ఇలా క్రికెట్ ఆడుతున్న విద్యార్థులకు వారి స్టడీ ఫీజులో 25శాతం వరకు తాము స్కాలర్షిప్ ద్వారా అందిస్తామని ఎంఈసీ స్టడీ గ్రూపు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







