వలస విద్యార్థులంతా రెసిడెంట్ కార్డులు పొందాలి
- September 14, 2021
ఒమన్: వలస విద్యార్థులంతా రెసిడెంట్ కార్డుని రాయల్ ఒమన్ పోలీస్ నుంచి పొందాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. పరముఖ ప్రైవేట్ స్కూళ్ళు, కమ్యూనిటీ స్కూళ్ళు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయమై సమాచారం అందించాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ జారీ చేసిన కొత్త విధి విధానాల్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశాయి. ఇండియన్ స్కూల్స్ అన్నీ ఇప్పటికే తమ విద్యార్థులకు రెసిడెంట్ కార్డు విషయమై సమాచారం అందించడంతోపాటు, దీనికి సంబంధించిన రికార్డుని మెయిన్టెయిన్ చేస్తున్నట్లు ఇండియన్ స్కూల్ మస్కట్ పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెంట్ కార్డు జిరాక్సుని స్కూలుకి సమర్పించాల్సి వుంటుంది. కొత్తగా అడ్మిషన్లు కోరే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు సంబంధించిన రెసిడెంట్ కార్డుని జత చేయాల్సి వుంటుందని సూచించారు. గతంలో 15 ఏళ్ళ లోపు వలస చిన్నారులకు, రెసిడెంట్ కార్డ్ అవసరం లేదు. కానీ, కొత్త రూల్ ప్రకారం 4 ఏళ్ళ చిన్నారులు కూడా రెసిడెంట్ కార్డు కలిగి వుండాలి. కాగా, 12 ఏళ్ళ లోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు. అలాగే వ్యాక్సినేషన్ కోసం రెసిడెంట్ కార్డుని తప్పనిసరి చేస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







