ఐసోలేషన్‌లోకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌

- September 14, 2021 , by Maagulf
ఐసోలేషన్‌లోకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నారు. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. జర్నలిస్టుల కోసం ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. తజక్ నేత ఎమ్మోమలి రెహమాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ మాట్లాడారు. అయితే తాను ఉంటున్న ప్రదేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని, కొన్ని రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు పుతిన్ ఆ ప్రకటనలో తెలిపారు.

మంగళవారమే సిరియా అధ్యక్షుడు అసద్ భాషర్‌ను పుతిన్ కలిశారు. క్రెమ్లిన్‌లో ఆ సమావేశం జరిగింది. సిరియా యుద్ధంలో అసద్‌కు పుతిన్ సపోర్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అసద్‌కు పుతిన్ కంగ్రాట్స్ తెలిపారు. అధ్యక్ష భవనంలో చాలా మందికి కరోనా సోకడం వల్ల కూడా పుతిన్ సెల్ఫ్ ఐసోలేట్ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోనే స్వదేశీ స్పుత్నిక్ టీకాను పుతిన్ వేసుకున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com