ఘంటసాల గుడిని సందర్శించిన ఉగాండా వాసి బూరుగుపల్లి

- November 03, 2021 , by Maagulf
ఘంటసాల గుడిని  సందర్శించిన ఉగాండా వాసి బూరుగుపల్లి

హైదరాబాద్ లో వంశీ - వేగేశ్న  ఆశ్రమంలో నెలకొనివున్న సద్గురు ఘంటసాల గుడిని ఉగాండా కి చెందిన బూరుగుపల్లి వ్యాసకృష్ణ సందర్శించారు.ఘంటసాల వారికి జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రకాశం గావించారు .. వంశీ - వేగేశ్న వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ,వంశీ మేనేజింగ్ ట్రస్టీ  వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి బూరుగుపల్లి వారిని ఘంటసాల జ్ఞాపికతో సత్కరించారు.. ఈ సందర్భంగా బూరుగు పల్లి వ్యాసకృష్ణ మాట్లాడుతూ వంశీ -  వేగేశ్న దివ్యాంగుల వృద్ధుల సేవలు ప్రశంసనీయమని, వారు  నిర్మించిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయం మరియు శిరిడి సాయి మందిరం ప్రశాంతతకు నిలయం అని ప్రశంసించారు.. రాబోయే ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను ప్రభావితం చేయగలవు అని అన్నారు..

కరోనా మూలంగా 2020 నుంచి అంతర్జాలంలో 5 ఖండాల లోని కళా సంస్థలతో తెలుగు కళాకారులతో  కలిసి వంశీ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నదని సద్గురు ఘంటసాల శత జయంతి కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా దేదీప్యమానంగా చేయబోతున్నామని కళా బ్రహ్మ శిరోమణి డా.వంశీ రామరాజు అన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com