మహిళ, చిన్నారిని ఢీకొట్టి పరారైన కారు డ్రైవర్..అదుపులోకి తీసుకున్న పోలీసులు

- November 06, 2021 , by Maagulf
మహిళ, చిన్నారిని ఢీకొట్టి పరారైన కారు డ్రైవర్..అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూఏఈ: హిట్ అండ్ రన్ కేసులో ఓ కారు డ్రైవర్ ను 8 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. షార్జాలోని అల్ తౌన్ రోడ్‌లో జరిగిన ఈ ఘటనలో అరబ్ ప్రవాసుడు విదేశీ మహిళ, ఆమె బిడ్డలను తన కారుతో ఢీకొట్టాడని, వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని షార్జా పోలీసులు చెప్పారు. గాయపడిన వారు షార్జాలోని అల్ తౌన్ రోడ్‌  దాటుతుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఫేస్‌బుక్ పోస్ట్ లో తెలిపారు. ‘‘అల్ తవున్ స్ట్రీట్‌లో జరిగిన ప్రమాదం గురించి పోలీసు ఆపరేషన్స్ రూమ్ కి సమాచారం అందింది. వెంటనే ట్రాఫిక్ పెట్రోలింగ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మహిళ, తన కూతురుతో కలిసి రోడ్డు  దాటుతుండగా, కారు వారిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాఫిక్ ట్రాకింగ్ సిస్టమ్స్, స్మార్ట్ కెమెరాల సాయంతో విచారణ చేపట్టాం. ప్రమాద స్థలానికి సమీపంలోని ఇసుక ఎక్కువగా ప్రాంతానికి డ్రైవర్ పారిపోయాడు. గంటల వ్యవధిలో గుర్తించి అతన్నిఅదుపులోకి తీసుకున్నారు.’’ అని షార్జా పోలీసులు ఫేస్ బుక్ పోస్ట్ లో వివరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పెడిస్ట్రియన్స్  నిర్దేశించిన క్రాసింగ్‌ల ద్వారా మాత్రమే రోడ్లు దాటాలని పోలీసులు కోరారు. వాహనదారులు  ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలకు ప్రధాన కారణమైన అతివేగాన్ని వాహనదారులు తగ్గించుకోవాలని షార్జా పోలీసులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com