ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..
- December 01, 2021
హైదరాబాద్: ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో శాస్త్రపరంగా అంతిమ సంస్కారాలు జరిగాయి. కడసారి చూపు కోసం సినీ పరిశ్రమలోని ప్రముఖులు, 24 విభాగాల వాళ్లంతా తరలి వచ్చారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పాటలతో చైతన్యం నింపిన పాటలరేడు.. అలా అచేతనంగా ఉండడం చూసి కన్నీళ్లు ఆగలేదు. సిరివెన్నెలతో ఆత్మీయ బంధం ఏర్పరుచుకున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ కలం ఇక రాయదని, సిరి లోగిలి నుంచి ఇకపై పాటలు రావని తలచుకుంటూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. పదంతో సమాజాన్ని కదిపిన సిరివెన్నెల ఆఖరి మజిలీలో.. నేను సైతం అంటూ పదం కలిపారు అభిమానులు.
సిరివెన్నెల కురిపించి.. ఇక సెలవంటూ వెళ్లిపోయిన సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు చిత్రసీమ తట్టుకోలేకపోతోంది. ఆ పాటసారిని, ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన వారందరి హృదయాలు.. అంతులేని వేదనతో సుడిగుండాలు అయ్యాయి. మాటలకందని విషాదం గుండెల్ని పిండేస్తుంటే.. బరువెక్కిన హృదయాలతో అక్కడికి వచ్చిన వారందరికి కళ్లలోనూ నీటిసుడులు తిరిగాయి. సినీరంగంతో అనుబంధం ఉన్నవారితోపాటు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అంతా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుని, వెలకట్టలేని అభిమానాన్ని పొందారు కాబట్టే.. ఆయన ఇక లేరనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీరంగానికి సీతారామశాస్త్రి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. ఈ అంతులేని విషాదం అలుముకున్న వేళ.. సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చడం ఇప్పుడు ఎవరివల్లా కావడం లేదు.
తాజా వార్తలు
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..







