38 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..

- December 04, 2021 , by Maagulf
38 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..

జెనీవా: సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌… అన్ని దేశాలు అంక్షలు విధించినా క్రమంగా విస్తరిస్తూనే ఉంది… జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసే పనిలోపడిపోయింది.. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ బారినపడి ఎవ్వరూ మృతిచెందకపోవడం ఊరట కలిగించే విషయమే.. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వ‌ర‌కు 38 దేశాలకు వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). ఈ వేరియంట్ ఆందోళ‌న‌క‌ర‌మేనని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో.. అయితే ఇప్పటి ఈ మహమ్మారితో ఎవరూ ప్రాణాలు వదలలేదని పేర్కొంది.. ఒమిక్రాన్‌ తాజా పరిస్థితిపై డ‌బ్ల్యూహెచ్‌వో టెక్నిక‌ల్ హెడ్ మారియా వాన్ ఖేర్‌కోవ్ ఓ నివేదిక ఇ్చారు.. ఇప్పటి వరకు 38 దేశాల్లో న‌మోదు ఈ తరహా కేసులు వెలుగుచూశాయని వెల్లడించారు. కాగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నివారణ చర్యల్లో భాగంగా.. పలు దేశాలు విదేశీ ప్రయాణికుల విషయంలో కొత్త ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com