నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ..
- December 07, 2021
ఖతార్: నిరుద్యోగులకు లేబర్ మినిస్ట్రీ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ వర్క్ పోర్స్ నుంచి ఉద్యోగులను నియమించుకునేలా ఖతార్ ఎయిర్ వేస్ తో లేబర్ మినిస్ట్రీ ఒప్పందాన్ని కుదరుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. నేషనల్ వర్క్ ఫోర్స్ నుంచి తమకు అవసరమైన వారిని ఖతార్ ఎయిర్ వేస్ నియమించుకోనుంది. ఎంపికైన వారికి అవసరమైన ట్రైనింగ్ ను ఇస్తామని లేబర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ మేరకు ఈ ఒప్పందంపై కార్మిక మంత్రి హెచ్ఈ డాక్టర్ అలీ బిన్ సమీఖ్ అల్ మర్రి, ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ సీఈఓ అక్బర్ అల్ బేకర్ సంతకాలు చేశారు. ఇరువర్గాల నడుమ కుదిరిన ఒప్పందం ప్రకారం కార్మిక మంత్రిత్వ శాఖ నిరుద్యోగుల డేటాను ఖతార్ ఎయిర్వేస్కు అందిస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్ లో ఒకటైన ఖతార్ ఎయిర్ లైన్స్ తో కుదిరిన ఒప్పందంతో స్థానిక యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని లేబర్ మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..