బహ్రెయిన్ లోని భర్తను పోలీసులకు పట్టించిన భార్య
- December 26, 2021
బహ్రెయిన్: మాంసం వ్యాపారం పేరిట మహిళలతో ఆడుకుంటున్న ఓ వ్యక్తిని అతని భార్య పోలీసులకు పట్టించింది. తన భర్త సోషల్ మీడియాలో మాంసం వ్యాపారం పేరిట మహిళలను ట్రాప్ చేస్తూ వారి న్యూడ్ వీడియోలను సేకరిస్తున్నాడని అతని భార్య ఫిర్యాదు చేసింది. దీంతో బహ్రెయిన్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల వ్యక్తిని ఇండియాలోని తమిళనాడులో పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య (25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్) ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక మహిళగా తన భర్తతోనే చాటింగ్ చేసి చెన్నై రప్పించింది. తన ట్రాప్ లో పడ్డదని భావించిన అతను.. తనతో చాట్ చేసిన మహిళను కలిసేందుకు బహ్రెయిన్ నుండి చెన్నైకి వచ్చాడు. ఈ క్రమంలో అతన్ని తన భార్య పోలీసులకు పట్టించింది. నిందితుడు బహ్రెయిన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడని, అయితే ఇది ఇంకా ధృవీకరణ కాలేదని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకున్నారు. అనుమానితుడు బహ్రెయిన్‌కు వెళ్లిన తర్వాత, అతని భార్య ఇంట్లోని డెస్క్ టాప్‌ను చెక్ చేసింది. అందులో చాలా మంది మహిళల న్యూడ్ వీడియోలను ఉండటం చూసి షాక్ అయింది. తన భర్త చాలా మంది మహిళలతో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ వారిని మోసం చేస్తున్నాడని గ్రహించింది. తన ‘వ్యాపారం’లో భాగంగా మహిళల న్యూడ్ వీడియోలను కావాలని కోరడం చూసి షాక్ తిన్నది. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి పోర్న్ వీడియోలకు బానిస అయినట్లు తెలుస్తోందని, స్వాధీనం చేసుకున్న ఫోన్, కంప్యూటర్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..