ముంబైలో 144 సెక్షన్
- December 30, 2021
ముంబై: మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై నగరంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి.దీంతో ముంబైలో 144 సెక్షన్ విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి జనవరి 7 వరకు ముంబైలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల నుంచి 2022 జనవరి 7 వరకు గ్రేటర్ ముంబై పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, పబ్‌లు, రిసార్టులు, క్లబ్‌లు సహా అనేక బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధలను ఉల్లంఘిస్తే అంటువ్యాధుల చట్టం 1897, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చట్టపరమైన నిబంధనలతో పాటు భారతీయ శిక్షాస్మృతి 180 ప్రకారం శిక్షార్హులు అవుతారని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి