ఖతార్ మంత్రి మండలి: ఫేస్ మాస్కులు అన్ని చోట్లా తప్పనిసరి

- December 30, 2021 , by Maagulf
ఖతార్ మంత్రి మండలి: ఫేస్ మాస్కులు అన్ని చోట్లా తప్పనిసరి

దోహా: బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి నిబంధనను కొన్నాళ్ళ క్రితమే తొలగించగా, తిరిగి దాన్ని తప్పనిసరి చేస్తూ ఖతార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అమిరి దివాన్ వద్ద జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అలాగే, మూసివున్న ప్రాంతాల్లో కూడా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు వెసులుబాటు కల్పించారు. ఒమిక్రాన్ మరియు డెల్టా వేరియంట్ కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా ీ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎగ్జిబిషన్లు వంటి చోట్ల 75 శాతం సామర్థ్యానికే అనుమతి. అదే, ఇండోర్ ఎగ్జిబిషన్లు వంటివాటిల్లో 50 శాతం సామర్థ్యానికే అనుమతి. వ్యాక్సినేషన్ పూర్తయినవారికి లేదా పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వున్నవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com