దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మహేష్
- January 02, 2022
దుబాయ్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఈ హ్యాండ్సమ్ హీరో కొత్త ఏడాది కొత్త హిస్టరీ సృష్టించాడు. ట్విట్టర్లో రికార్డు సృష్టించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు మహేష్. న్యూఇయర్ ప్రారంభం సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్న మహేష్ ట్విట్టర్లో దుబాయ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.అభిమానులందరికి న్యూఇయర్ విషెస్ తెలియజేస్తూ అందరూ దయతో, కృతజ్ఞతతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ మైక్రోబ్లాగింగ్ సైట్లో సంచలనం సృష్టించింది.
మహేష్ ఒక్క ట్వీట్ కే లక్షకు పైగా లైక్ లు రావడం విశేషం. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే 1 లక్షకు పైగా లైక్‌లను పొందిన మహేష్ 31వ ట్వీట్ ఇది. సోషల్ మీడియాలో ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక భారతీయ నటుడు. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్‌లతో కూడా సినిమాలు చేయబోతున్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి