ఇండ‌స్ట్రీ పెద్ద‌గా నేను ఉండ‌ను : మెగాస్టార్ చిరంజీవి

- January 02, 2022 , by Maagulf
ఇండ‌స్ట్రీ పెద్ద‌గా నేను ఉండ‌ను : మెగాస్టార్  చిరంజీవి

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈవెంట్ సందర్భంగా దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు… ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరగా చిరంజీవి ఈ విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కరోనాతో చాలామంది ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికిపోయారు. సినీ కార్మికుల కోసం ఏదైనా చేయాలనీ ఆలోచించాను. సినీ కార్మికులకు భవిష్యత్ లో ఏం కావాలన్నా చేస్తా… అయితే సినిమా ఇండస్ట్రీకి నేను పెద్ద కాను… ఆ పదవిలో ఉండలేను. అవసరానికి అండగా ఉంటా… అంతేకానీ అనవసర పంచాయతీలు నాకొద్దు. బాధ్యతగా ఉంటా.. సమస్యలొస్తే ఆదుకుంటా… అంతకుమించిన వ్యవహారాలను పట్టించుకోను. ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ముందుకు రాను” అంటూ వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com