భారత్: ఒకే విమానంలో 125 మందికి పాజిటివ్‌…

- January 06, 2022 , by Maagulf
భారత్: ఒకే విమానంలో 125 మందికి పాజిటివ్‌…

న్యూ ఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయిన‌ట్టు ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, రాబోయే నాలుగు వారాలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇక‌, విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  రిస్క్‌, ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చేవారికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ జరిగితే హోమ్ ఐసోలేష‌న్ లేదా క్వారంటైన్ కు పంపుతున్నారు.  శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు.  

విదేశాల నుంచి వ‌చ్చిన వారి ద్వారా దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది.  ఇక ఇదిలా ఉంటే, ఇట‌లీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌కి వ‌చ్చిన ఒక ఛార్టర్డ్  విమానంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  ఇట‌లీ నుంచి అమృత్ స‌ర్ కు ఛార్టర్డ్ విమానంలో వ‌చ్చిన 125 మందికి క‌రోనా సోకింది. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.  ప్ర‌స్తుతం 125 మంది ప్ర‌యాణికుల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com