శ్రీవారి భక్తులకు శుభవార్త...
- January 08, 2022
తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. గత ఏడాది భారీ వర్షాల కారణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలగలేదు. దీంతో దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో అప్పుడు స్వామి వారి దర్శనం చేసుకోని వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. మళ్లీ దర్శనం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు టికెట్లు కలిగి దర్శనం చేసుకోలేకపోయిన భక్తుల వినతి మేరకు టీటీటీ వారికి ఆరు నెలల్లోపు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఆ టికెట్లపై అనుమతి ఉండదని ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనం కారణంగా ఈ తేదీలు మినహాయించి వారు మరి ఏ తేదీల్లోనైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని టీటీటీ తెలిపింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి