కోవాక్సిన్ బూస్టర్ డోస్‌తో మంచి ఫలితాలు...
- January 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు 10 రోజుల్లోనే 10 వేల కేసుల నుంచి లక్షన్నర వరకు మహమ్మారి కేసులు పెరిగాయి. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. చిన్నపిల్లలతోపాటు.. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ సైతం వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ బూస్టర్ డోస్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది. కోవ్యాక్సిన్ బూస్టర్ డోసుతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, దీర్ఘకాలిక రక్షణ కల్పించే సామర్థ్యం ఈ టీకాకు ఉందని భారత్ బయోటెక్ సంస్థ శనివారం వెల్లడించింది. కొవాగ్జిన్ బూస్టర్ డోస్‌తో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. కోవాక్సిన్ వ్యాక్సిన్ తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను శనివారం వెల్లడించింది.
కోవ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వలంటీర్లకు 6 నెలల తర్వాత బూస్టర్ ఇచ్చినట్లు తెలిపింది. 2 డోసుల ప్రభావంతో వారిలో యాంటీబాడీలు ఇంకా క్రియాశీలంగానే ఉన్నట్లు పేర్కొంది. 90 శాతం మందిలో యాంటిబాడీలు పెరిగినట్లు తెలిపింది. బూస్టర్ డోసుతో యాంటీబాడీల సంఖ్య 19 నుంచి 265 రెట్లు పెరిగిందని తెలిపింది. రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ పిల్లలకు, పెద్దలకు కోవాక్సిన్ బూస్టర్ ఇచ్చేందుకు తాజా ఫలితాలతో మార్గం సుగమం అయినట్లు వెల్లడించారు. బూస్టర్‌తో రక్తంలో బీ, టీ సెల్స్ పెరుగుదలను సైతం గుర్తించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి