కోవిడ్ చికిత్సకు పగడ్బందీ చర్యలు

- January 10, 2022 , by Maagulf
కోవిడ్ చికిత్సకు పగడ్బందీ చర్యలు

కువైట్: దేశంలో కోవిడ్-19 క్లినికల్ కేసుల పెరుగుదలను తట్టుకునేలా హెల్త్ వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్ట్రీ(MoH) తెలిపింది. ఎలాంటి పరిస్థతుల్నైనా ఎదుర్కునేందుకు కోవిడ్ వార్డులలో ఐసియు బెడ్లను అందుబాటులో పెట్టామన్నారు. పరిస్థితులను గమనిస్తున్నామని, అత్యవసర మెడికల్ టీమ్స్ రెడీగా ఉన్నాయని MoH తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. మాస్కులు పెట్టుకోవాలని, పూర్తి టీకాలను పొందాలని, అర్హులైన వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ కు మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని, విదేశాల నుండి దేశానికి వచ్చే వారు నిర్దేశిత కాలానికి క్వారంటైన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇతరులతో కలవవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇతర వ్యక్తులతో కలవవద్దని హెల్త్ మినిస్ట్రీ పిలుపునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com