2021లో అబుధాబి పోలీస్ కాల్ సెంటర్ కు 150,000 కాల్స్

- January 11, 2022 , by Maagulf
2021లో అబుధాబి పోలీస్ కాల్ సెంటర్ కు 150,000 కాల్స్

UAE: 2021లో అబుధాబి పోలీసుల అమన్ సర్వీస్‌కు ప్రజల నుండి మోసం, బ్లాక్‌మెయిల్, కమ్యూనిటీ భద్రత, ప్రమాదాలు, ఇతర నేరాలకు సంబంధించి 150,000 కాల్స్ వచ్చాయి. సమాజ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ ను భాగస్వామ్యం చేయడం అమన్ సేవ లక్ష్యం. దీని ద్వారా ముఖ్యంగా నేరాలను ముందస్తుగా నిరోధించడానికి ఉద్దేశించబడింది. ప్రతి ఒక్కరి భద్రతా బాధ్యతను తీసుకోవడం, సమాచారాన్ని అందించేందుకు ఈ సర్వీసును ప్రారంభించారు. నేరాలు, ఇతర సమస్యలను అమన్ సర్వీస్‌కు అందించడానికి 8002626కు కాల్ చేయొచ్చు. 2828కి టెక్స్ట్ పంపొచ్చు లేదా ADPolice స్మార్ట్ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ADpolice వెబ్‌సైట్ లేదా ఇమెయిల్‌ ([email protected]
)ను కూడా కంప్లైంట్ చేయవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com