పెట్రోల్ బంక్ పేలుడులో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ మృతి

- January 17, 2022 , by Maagulf
పెట్రోల్ బంక్ పేలుడులో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ మృతి

అబుధాబి: మూడు ఆయిల్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరోపక్క, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మరో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి వల్లే ఈ ఘటనలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ వున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అడ్నాక్ స్టోరేజీ ట్యాంకర్ల వద్ద ముసాఫా ఐసిఎడి 3 పెట్రోలియం ట్యాంకర్ల వద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు మరిన్ని వివరాల కోసం సంబంధిత యూఏఈ ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com