అబుధాబి పై ఉగ్రదాడి...ఖండించిన యూఏఈ ప్రభుత్వం..

- January 17, 2022 , by Maagulf
అబుధాబి పై ఉగ్రదాడి...ఖండించిన యూఏఈ ప్రభుత్వం..

అబుధాబి: యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ అబుధాబిలో దాడిని ఖండించింది.ఈ దాడికి పాల్పడిన వారిని విధిగా శిక్షిస్తామని యూఏఈ ప్రతిజ్ఞ చేసింది.

"ఈ ఉగ్రవాద దాడులు, పెరిగిపోతున్న నేరాలపై  ప్రతిస్పందించే హక్కు యూఏఈకి ఉంది" అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.అంతర్జాతీయ మరియు మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ, హౌతీ మిలిటంట్లు చేసిన ఈ దాడులను "హీనమైన నేరం"గా అభివర్ణించింది.

యూఏఈలో అస్థిరత కలిగించేందుకు హౌతీ బృందం తీవ్రవాదం మరియు గందరగోళాన్ని వ్యాప్తి చేస్తూనే ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.పౌరులు మరియు పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద చర్యలను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది యూఏఈ.

మృతుల కుటుంబాలకు మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

కాగా, అబుధాబి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రోన్‌ దాడులకు తమ పనేనని ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా..ఈ డ్రోన్‌ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.అబుధాబి విమానాశ్రయంలోని ఇంధనం వాహన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం.సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల ఫలితంగా పెర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.తాజా దాడుల్లో.. మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.యూఏఈ యొక్క కొత్త విమానాశ్రయం నిర్మాణ స్థలంలో మంటలు సంభవించినట్లు అబుధాబి పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com