ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదు:WHO
- January 19, 2022
జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది.వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.
కరోనా మహమ్మారిలో ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఇంకా చాలా వేరియంట్లు ప్రపంచానికి సవాల్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. సుమారు 180 దేశాల నుంచి 7 మిలియన్ల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత ఈ హెచ్చరికలు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. కరోనా మహమ్మారి విషయంలో గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నా.. అదేమీ అంత సివియర్ కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్ తీసుకుంటున్నాయి. కరోనా నిబంధనల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారు. భౌతికదూరం, మాస్కు ధరించడం వంటివి పట్టించుకోవడం లేదు.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, తీవ్రత తక్కువగా ఉందని చెప్పి.. ఆ వేరియంట్ ను తక్కువ చేసి చూడటం పొరపాటే అవుతుందంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎలా విరుచుకుపడుతుంతో ఇప్పుడే అంచనా వేయలేమని ప్రపంచ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. సార్స్ కోవ్ 2 వైరస్‌ను తక్కువగా అంచనా వేశారని, ఆ తర్వాత దాని ప్రభావం ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదంది డబ్ల్యూహెచ్ఓ. కాబట్టి, కరోనా కొత్త వేరియంట్ ను లైట్ తీసుకోవద్దని, నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి