మనీలాండరింగ్ నిందితుల నుండి SR2 బిలియన్లు జప్తు

- January 31, 2022 , by Maagulf
మనీలాండరింగ్ నిందితుల నుండి SR2 బిలియన్లు జప్తు

రియాద్: మనీలాండరింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ దాదాపు SR2 బిలియన్లను జప్తు చేసింది. ఆర్థిక నేరాలపై న్యాయస్థానం ప్రాథమిక తీర్పును అనుసరించి ఈ మొత్తాన్ని సీజ్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని ఒక అధికారి తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో సంపాదించిన మొత్తాన్ని కంపెనీల ముసుగులో దేశం దాటించిన నిందితుల దగ్గర నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేశారు. విదేశాలకు బదిలీ చేసిన దానితో సమానమైన మొత్తాన్ని జప్తు చేయడంతోపాటు ఈ నేరాల్లో పాల్గొన్న వాణిజ్య సంస్థల నుంచి మొత్తం SR100 మిలియన్ల జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత నిందితులను సౌదీ అరేబియా నుంచి బహిష్కరించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com