సౌదీలో అబ్షర్, తవక్కల్నా యాప్‌ల విలీనం!

- February 07, 2022 , by Maagulf
సౌదీలో అబ్షర్, తవక్కల్నా యాప్‌ల విలీనం!

సౌదీ: అబ్షర్ (Absher), తవక్కల్నా(Tawakkalna) యాప్ లను విలీనం చేసే యోచనలో సౌదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సిటిజన్, రెసిడెంట్స్ ఒకే పోర్టల్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవల ప్రయోజనాన్ని పొందేలా చేయడం లక్ష్యంగా యాప్ ల విలీనం చేపట్టాలని యోచిస్తుంది. విలీనం తర్వాత ఏకీకృత ప్లాట్‌ఫారమ్ పౌరులు, నివాసితులతో సహా లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందిస్తుంది. అన్ని ప్రభుత్వ రంగాలను ఎలక్ట్రానిక్‌గా అనుసంధానించే ఒకే అప్లికేషన్‌ లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తుందని సౌదీ అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com