NBK 107: సింహం మొదటి హంట్ మొదలెట్టేసింది

- June 09, 2022 , by Maagulf
NBK 107: సింహం మొదటి హంట్ మొదలెట్టేసింది

బాలయ్య 107వ చిత్రంగా తెరకెక్కుతోన్న మూవీకి సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టైటిల్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, టైటిల్ రిలీజ్ చేయలేదు. కానీ, టీజర్ మాత్రం బాలయ్య మాస్ అప్పియరెన్స్‌కి తగ్గట్టుగా వుంది.

థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. హీరో ఎలివేషన్ సీన్లు బాలయ్య సినిమాల్లో ఎలా వుంటాయో అలాగే వున్నాయ్.  ఓ యాక్షన్ బిట్ కట్ చేశారు. జనాల చేత దండాలు పెట్టించుకోవడం.. అఖండ కత్తి..  లుంగీ ఎగ్గట్టి, రౌడీల్ని ఎగరగొట్టి తన్నడాలు.. ఇవన్నీ బాలయ్య సినిమాల్లో సహజంగా వుండే యాక్షన్ ఎలివేషన్సే.

వాటినే ఈ టీజర్‌లోనూ హైలైట్ చేశారు. ఇక డైలాగుల విషయానికి వచ్చేద్దాం. మాస్ డైలాగులు పేల్చడంలో బాలయ్య ది కింగ్. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా డైలాగులు చొప్పించారు. ‘బోసు డీకే, నా కొడకల్లారా..’ లాంటివి.

‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అయితే, నా జీవో గాడ్స్ ఆర్డర్..’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఎప్పటిలాగే ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే..’ అంటూ మాస్ బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్ డైలాగ్ ఒకటి మధ్యలో. ‘నరకడం మొదలెడితే, ఏ పార్ట్ ఏంటో మీ పెళ్లాలకి కూడా తెలీదురా నా కొడకల్లారా..’ అంటూ టీజర్ ఎండ్ చేశారు.

బాలయ్య అభిమానులయితే, ఈ టీజర్‌కి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే, టైటిల్ ఇంకా రిలీజ్ చేయకపోవడంపై కాస్త నిరాశ పడుతున్నారు అభిమానులు. టీజర్‌లో హీరోయిన్‌ (శృతిహాసన్)కి గానీ, మరే ఇతర నటీ నటులెవ్వరికీ చోటు దక్కలేదు. సింహం సింగిల్‌గా వచ్చేసింది. కత్తి పట్టి నరుక్కుంటూ పోయింది. అదీ సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com