యూఏఈ దిర్హామ్ తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో పతనమైన ఇండియన్ రూపాయి
- June 29, 2022
యూఏఈ: విదేశీ నిధులు ప్రవాహం కారణంగా మదుపరులు తమ సెంటిమెంట్స్ ను గౌరవిస్తూ పెట్టుబడులు ఉపసంహరణ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి రూ. 78.59 కు చేరుకుంది.
మార్కెట్ ప్రారంభ సమయానికి అమెరికన్ డాలర్ (వయా యూఏఈ దిర్హామ్) తో పోలిస్తే రూపాయి మారకం 78.53 వద్ద ఉండగా మార్కెట్ ముగిసే నాటికి 22 పైసలు క్షీణించి 78.59 వద్ద ఆగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కావడం గురించి మెహతా ఈక్విటీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ రష్యా పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుదల మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల కరెన్సీ ల పై ఒత్తిడి పెంచేందుకు దోహదపడతాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటుగా దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐ ల నిరంతర విక్రయాలు కూడా రూపాయి పై ఒత్తిడి పెంచుతున్నాయి అని పేర్కొన్నారు.
ఈ వారం మొత్తం రూపాయి విలువ అస్థిరంగా ఉండటంతో పాటు ప్రస్తుత మారకం స్థాయిని సైతం దాటవచ్చని మేము భావిస్తున్నాం అని రాహుల్ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..