కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కార్మికులు అరెస్టు

- August 13, 2022 , by Maagulf
కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కార్మికులు అరెస్టు

బహ్రెయిన్: రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కార్మికులను బ‌హ్రెయిన్ అధికారులు అరెస్టు చేశారు. హ్రెయిన్లో రెసిడెన్సీ,  లేబర్ చట్టాలను ప‌ర్య‌వేక్షించేందుకు తీనిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన పలువురు కార్మికులను అధికారులు అరెస్టు చేశారు. జాతీయత, పాస్పోర్ట్లు , నివాస వ్యవహారాలు క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్.. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీతో క‌లిసి ఈ త‌నిఖీల‌ను నిర్వహించాయి. రాబోయే రోజుల్లో త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేస్తామ‌ని  ఎగ్జిట్స్, సెర్చ్ అండ్ ఫాలో-అప్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ రెహమాన్ అల్-దోసరీ తెలిపారు.   ఉపాధికి సంబంధించిన ఫిర్యాదులను అధికారుల‌కు తెల‌పాల‌ని ప్రజలకు ఆయ‌న‌ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com