FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022.. పెరిగిన అద్దెలు

- August 13, 2022 , by Maagulf
FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022.. పెరిగిన అద్దెలు

దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కంటే ముందే రెసిడెన్షియల్ అద్దెలు పెరిగాయి. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) అద్దెలలో బలమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా అపార్ట్మెంట్ల ధ‌రుల అత్యధికంగా పెరిగాయని కుష్మాన్ & వేక్ఫీల్డ్ తన నివేదిక‌లో తెలిపింది. FIFA ప్రపంచ కప్‌కు ముందు పెరిగిన‌ డిమాండ్ల కార‌ణంగా అద్దెలు 30 శాతానికి పైగా పెరిగాయని నివేదిక పేర్కొంది. Q1లో 5-7 శాతం వృద్ధిని అనుసరించి.. నవంబర్, డిసెంబర్లలో జరిగే FIFA ప్రపంచ కప్‌కు సంబంధించి నెల‌కొన్న డిమాండ్ నేప‌థ్యంలో ఏప్రిల్, మే నెలల్లో రెసిడెన్షియల్ అద్దెల‌ పెరుగుదలకు కార‌ణ‌మైంద‌ని నివేదిక తెలిపింది. పోర్టో అరేబియాలో 2021లో QR10,000 – QR12,000కి అందుబాటులో ఉన్న సాధారణ రెండు పడకగదులు, సెమీ-ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లు ఇప్పుడు QR13,000 – QR15,000కి పెరిగాయి. ఇదే స‌మ‌యంలో రెసిడెన్షియల్ సేల్స్ లావాదేవీల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో 19 శాతం తగ్గడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com