యూఏఈలో ఆగస్ట్ 14 నుండి వర్షాలు!
- August 13, 2022
యూఏఈ: అబుదాబిలో ఆగస్ట్ 14-18 మధ్య తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉష్ణోగ్రత తగ్గుదలతో ఏర్పడ్డ క్యుములస్ మేఘాల కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను విడుదల చేసింది. వర్షాల వేళ వాహనదారులు వేగ పరిమితులకు కట్టుబడి ఉండాలని సూచించింది. వర్షం పడుతున్నప్పుడు వర్షపు ప్రవాహాలు, లోయలు, వర్షపు నీటి కొలనుల నుండి దూరంగా ఉండాలని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అధిక ఆటుపోట్ల సమయంలో, బీచ్‌కి వెళ్లోద్దని సూచించింది. అధికారిక మార్గాల ద్వారా మాత్రమే వచ్చే వాతావరణ సూచనలను అనుసరించాలని కోరింది. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) రాబోయే వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి దాని సంసిద్ధతను చర్చించడానికి వివిధ విభాగాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







