బీ టౌన్‌లోనూ ‘కార్తికేయ 2’ హవా మామూలుగా లేదుగా.!
- August 19, 2022
టాలీవుడ్లో తొక్కివేయబడ్డ సినిమాగా బోలెడంత సింపథీ గెయిన్ చేసుకుంది ‘కార్తికేయ 2’ సినిమా. ఆ సింపథీనే వర్కవుట్ అయ్యిందో, లేక కంటెంట్ నిలబెట్టేసిందో తెలీదు కానీ, మొత్తానికి ‘కార్తికేయ 2’ సూపర్ డూపర్ హిట్ సినిమా లిస్టులోకి చేరిపోయింది.
బాక్సాఫీస్ వద్ద సెలవులతో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతోంది. ఇక, బాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా రాకెట్ స్పీడుతో దూసుకెళుతోంది. మొదట 50 ధియేటర్లు మాత్రమే దక్కించుకున్న ‘కార్తికేయ 2’ సక్సెస్ టాక్‌తో ప్రస్తుతం 700 ధియేటర్లను ఆక్యుపై చేసింది.
సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కంటెంట్ వున్నోడికి కటౌట్‌తో పని లేదు.. అంటే ఇదే మరి. ఎంతలా తొక్కేయాలనుకున్నా ‘కార్తికేయ 2’ని తొక్కేయడం సాధ్యం కాలేదు.
ఇక బాలీవుడ్లో ఇంతవరకూ నిఖిల్ అంటే ఎవరికి తెలీదు. కానీ, కంటెంట్ బేస్ మూవీస్‌కి హీరో, హీరో ఇమేజ్‌తో కూడా పని లేదని మరోసారి కార్తికేయ 2 సినిమాతో ప్రూవ్ అయ్యింది. శ్రీ కృష్ణుడి చరిత్ర ఆధారంగా రూపొందిన ‘కార్తికేయ 2’ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ హిస్టరీనే ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్నారు.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







