సీతమ్మకు క్యూ కడుతున్న ఆఫర్లు.!
- August 19, 2022
‘మృణాల్ ఠాకూర్’.. ఇప్పుడీ పేరుకు పరిచయం అక్కర్లేదు. ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్గా నటించిన బీ టౌన్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే తెలుగులో ఘన విజయం సాధించింది. ఒక్క హిట్టు కొడితే చాలు.. తెలుగులో ఆ ముద్దుగుమ్మలకున్న క్రేజ్ వేరే లెవల్.
ఇప్పుడు అలాంటి క్రేజ్‌నే మృణాల్ ఠాకూర్ దక్కించుకుంటోంది. అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయట. ముఖ్యంగా యంగ్ హీరోలు మృణాల్ ఠాకూర్‌ని హీరోయిన్గా సూచిస్తున్నారట. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థలు మృణాల్‌ని హోల్డ్‌లో పెడుతున్నారట.
ఇదిలా వుంటే, ప్రస్తుతం టాలీవుడ్లో కృతి శెట్టి హవా కొనసాగుతోంది. ఆ తర్వాత పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల బిజీగా వుంది. ఇక ఇప్పుడు అనూహ్యంగా మృణాల్ ఠాకూర్ రేస్‌లోకి దూసుకొచ్చింది. చాలా కథలు చర్చకొస్తున్నాయట. అయితే, ఆచి తూచి అడుగేయాలనే వుద్దేశ్యంతో వుందట మృణాల్ ఠాకూర్. అవును తొందరపడి వచ్చిన ఆఫర్‌ని దక్కించేసుకోవాలని ఆతృత చూపిస్తే, మొదటికే మోసం వస్తుంది.
‘సీతారామం’లో సీత పాత్రలో చాలా బ్యాలెన్సింగ్‌గా నటించిన మృణాల్ ఠాకూర్ తదుపరి ఎలాంటి సినిమా చేయబోతుందో అనేదానిపై అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఆ విషయంలో క్లారిటీ రానుందట.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







